Dosti Song Lyrics Telugu | RRR Movie | Jr NTR , Ram Charan | Jr NTR Music
Dosti Song Telugu | RRR Movie | Jr NTR
పల్లవి :
పులికి విలుకాడికి..
తలకి ఉరితాడుకి..
కదిలే కార్చిచ్చుకి…
కసిరే వడగళ్ళకి..
రవికి మేఘానికి…. దోస్తీ…. (దోస్తీ)…
ఊహించని చిత్ర విచిత్రం..
స్నేహానికి చాచిన హస్తం..
ప్రాణానికి ప్రాణం ఇస్తుందో తీస్తుందో….
ధరదంథర దంధర దంధమ్
ధరదంథర దంధర దంధమ్
ధరదంథర దంధర దంధమ్
ధంధర దందందం
బడబాగ్నికి జడివానకి దోస్తీ...
విధిరాతకి ఎదురీతకి దోస్తీ...
పెను జ్వాలకి హిమనగమిచ్చిన కౌగిలి ఈ దోస్తీ..
ధరదంథర దంధర దంధమ్
ధరదంథర దంధర దంధమ్
ధరదంథర దంధర దంధమ్
ధంధర దందందం
చరణం : 1
అనుకోని గాలి దుమారం
చెరిపింది ఇరువురి దూరం
ఉంటారా ఇకపై ఇలాగ వైరమే కూరిమై..
నడిచేది ఒకటే దారై
వెతికేది మాత్రం వేరై
తెగిపోదా ఎదో క్షణాన స్నేహమే ద్రోహమై
ఓ… తొందర పడి పడి ఉరుకలెత్తే ఉప్పెన పరుగుల హో
ముందుగ తెలియదు ఎదురు వచ్చే తప్పని మలుపులే ఓ..
ఊహించని చిత్రవిచిత్రం
స్నేహానికి చాచిన హస్తం
ప్రాణానికి ప్రాణం ఇస్తుందో తీస్తుందో
ధరదంథర దంధర దంధమ్
ధరదంథర దంధర దంధమ్
ధరదంథర దంధర దంధమ్
ధంధర దందందం
బడబాగ్నికి జడివానకి దోస్తీ
విధిరాతకి ఎదురీతకి దోస్తీ
పెను జ్వాలకి హిమనగమిచ్చిన కౌగిలి ఈ దోస్తీ
చరణం : 2
ఒక చెయ్యి రక్షణ కోసం..
ఒక చెయ్యి మృత్యు విలాసం...
బిగిసాయి ఒకటయ్యిలాగ తూరుపూ పడమర..
ఒకరేమో దారునశస్త్రం..
ఒకరేమో మారణశాస్త్రం..
తెరతొలగి పోతే ప్రచండయుద్దమే జరగదా...
ఓ.. తప్పని సరి అని తరునమొస్తే జరిగే జగడములో
ఓటమి ఎవరిదో గెలుపెవరిదో తేల్చే వారెవరో...
ఊహించని చిత్రవిచిత్రం..
స్నేహానికి చాచిన హస్తం..
ప్రాణానికి ప్రాణం ఇస్తుందో తీస్తుందో..
ధరదంథర దంధర దంధమ్
ధరదంథర దంధర దంధమ్
ధరదంథర దంధర దంధమ్
ధంధర దందందం
బడబాగ్నికి జడివానకి దోస్తీ
విధిరాతకి ఎదురీతకి దోస్తీ
పెను జ్వాలకి హిమనగమిచ్చిన కౌగిలి ఈ దోస్తీ..
Music : MM కీరవాణి గారు
Lyrics : సీతారామశాస్త్రి గారు
Telugu Song Singer : హేమచంద్ర
Music Album Rights : Lahari Music
Movie : RRR Movie
Director : SS Rajamouli
Cast : NTR Jr , Ram Charan, Ajay Devgn, Alia Bhatt, Olivia Morris, Shreya Saran.
Follow Us on All Social Media Platforms
Telegram : https://t.me/jrntrmusic or Search#JrNTRMusic On Telegram
YouTube : youtube.com/c/jrntrmusic
No comments:
Post a Comment